30 August, 2026 | 2:52 AM

పారిశుద్ధ్యం, జంక్షన్ అభివృద్ధి పనుల తనిఖీ

30-08-2026 12:00 AM

సికింద్రాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి అల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించి పారిశుద్ధ్య నిర్వహణ, జంక్షన్ అభివృద్ధి, రోడ్ల పరిస్థితి మరియు ఆక్రమణల అంశాలను సమీక్షించారు. ఈ తనిఖీలో టీమ్స్ సమీపంలోని టి -జంక్షన్, రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్, ఏ డబ్ల్యు హెచ్ ఓ కాలనీలోని టీ-జంక్షన్ ప్రాం తాలను పరిశీలించి, అక్కడి ప్రస్తుత పారిశు ద్ధ్య పరిస్థితులు, ప్రతిపాదిత జంక్షన్ అభివృ ద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు.

జంక్షన్ అభివృద్ధి పనులకు వేగం..

ప్రతిపాదిత జంక్షన్ అభివృద్ధి పనులను వెంటనే చేపట్టి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జం క్షన్లలో ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు స్థలాన్ని సమర్థవం తంగా వినియోగించేలా పనులు చేపట్టాలని సూచించారు.

హెచ్టి లైన్ ఆర్ డి పి ప్రతిపాదన.

హెచ్టి లైన్ ఆర్ డి పి అంశాన్ని స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసం సమర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏసిపి టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

చెత్త సేకరణపై ప్రత్యేక పర్యవేక్షణ

అల్వాల్ సర్కిల్ పరిధిలోని అన్ని చెత్త సేకరణ పాయింట్లతో పాటు సెకండరీ చెత్త సేక రణ పాయింట్ల నుంచి కూడా ప్రతిరోజూ చె త్తను ఎటువంటి ఆలస్యం లేకుండా తరలించాలని రామ్కీ పారిశుద్ధ్య సిబ్బందికి స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి రోజువారీగా చెత్త సేకరణ జరిగేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని డిఈ (ఎస్ డబ్ల్యూ ఎం )అధికారులను ఆదేశించారు. 

ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు

ప్రధాన జంక్షన్లు, ప్రభావిత రోడ్లపై ట్రాఫిక్ రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలను గుర్తించి, నిబంధనల ప్రకారం తక్షణమే తొలగించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత ఏసీబీ ని కమిషనర్ ఆదేశించారు. రహదారులు అవరోధాలు లేకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అల్వాల్ సర్కిల్లో పారిశుద్ధ్యం, రోడ్డు పరిస్థితులు, జంక్షన్ అభివృద్ధి మరియు సమగ్ర పౌర సదుపాయాల మెరుగుదలకు అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో, వేగవంతంగా మరియు బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ తనిఖీలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, డిఈఈ మెయింటెనెన్స్,ఏసిపి, డిఈఈ (ఎస్ డబ్ల్యూ ఎం ), డిపిఓ , అల్వాల్ సర్కిల్ హార్టికల్చర్ విభాగం అధికారులు మరియు సంబంధిత సిబ్బంది తదితరు పాల్గొన్నారు.