18 March, 2026 | 12:59 PM

ఎంఎంసీ భవన నిర్మాణ స్థలం పరిశీలన

18-03-2026 12:00 AM
  1. రూ. 98 కోట్లు మంజూరు 
  2. ఉప్పల్ బాగాయత్‌లో 10 ఎకరాల కేటాయింపు 

మేడ్చల్, మార్చి 17 (విజయ క్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 98 కోట్లు మంజూరు చేసింది. ఉప్పల్ భగయత్ 10 ఎకరాలు కేటాయించింది. నిధులు మంజూ రు చేయడంతో ప్రతిపాదిక స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు డిసిసి అధ్యక్షుడు వజ్రష్ యాదవ్, మాజీ ఎంపీ మధుయాష్కి, ఉప్ప ల్ నియోజకవర్గ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు.

త్వరలోనే పను లు ప్రారంభమవుతాయని వారు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, సీనియర్ నాయకులు రాపోలు రాములు, వేముల మహేష్ గౌడ్, తోటకూర అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.