వృత్తి ధర్మాన్ని విజయవంతంగా నిర్వహించే వారే డాక్టర్లు
01-07-2026 04:01 PM
బోథ్,(విజయక్రాంతి): రాత్రి పగలు విధులను నిర్వహించేవారు డాక్టర్లు అని వేదం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ పేర్కొన్నారు. డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం విద్యార్థులకు డాక్టర్స్ విడుదలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పిల్లలు వైద్యుల వేషధారణ గురించి వైద్యం అందించే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైద్యులకు పుష్ప గుచ్చాలు అందించి వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు






