23-02-2026 06:43:16 PM
ఐఎఫ్ఎస్ అధికారి నికిత
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మెదక్ నుండి ఎల్లారెడ్డి నేషనల్ హైవే రోడ్డులో భాగంగా నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల బంజారా నుండి తాండూర్ గేటు మధ్యలో గల ఫారెస్ట్లోని వివిధ మొక్కలను ఐఎఫ్ఎస్ జిల్లా అధికారి నికిత తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం తాండూర్ గేటు సమీపంలో నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.మొక్కల పట్ల పలు జాగ్రత్తల గురించి సూచనలు సలహాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాసుదేవ్,డిప్యూటీ ఎఫ్ఆర్వో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.