8 March, 2026 | 3:29 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

కౌన్సిలర్ రద్దుపై కోర్టు స్టేకు కృషి చేస్తా

23-02-2026 06:40 PM

గుండ స్నేహకు కేటీఆర్ హామీ

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారన్న కారణంతో కౌన్సిలర్ గుండ స్నేహ సభ్యత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి ఆమె భర్త గుండ శ్యామ్ దంపతులు హైదరాబాద్ లోని  క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్థితిని కేటీఆర్‌కు వివరించినట్లు వారు తెలిపారు.

కౌన్సిలర్ పదవికి ఎలాంటి ప్రమాదం లేదని, కోర్టులో రద్దు ఉత్తర్వులపై స్టే తీసుకొచ్చేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. తన వ్యక్తిగత లాయర్‌తో మాట్లాడి వారం రోజుల్లోపు కౌన్సిలర్ రద్దుపై స్టే వచ్చే విధంగా ప్రయత్నిస్తానని తెలిపినట్లు వెల్లడించారు.ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి సమన్వయంగా పనిచేయాలని సూచించారని, రానున్న రోజుల్లో తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు గుండ శ్యామ్ దంపతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిర్యాణి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు  జగదీష్ పాల్గొన్నారు.