ఓంనగర్ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
05-08-2026 12:41 AM
రాజేంద్ర నగర్ ఆగస్టు 4 (విజయ క్రాంతి): రాజేంద్ర నగర్ సర్కిల్ బండ్ల గూ డా పరిధిలోని ఓం నగర్ కాలనీలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న 100 కేవీ ట్రా న్స్ఫార్మర్ ఏర్పాటు సమస్య తీరినట్లేనని బిఅర్‌ఎస్ నాయకులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఏఈకి , ఏడి లైన్మెన్ లైన్స్పెక్టర్‌కు ఓం నగర్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామనీ నవీన్ కుమార్ ముదిరాజ్ తెలిపారు.






