హైడ్రాతో కబ్జాదారులకు నిద్రపట్టడం లేదు
05-08-2026 12:41 AM
- ప్రభుత్వ భూములను రక్షిస్తుంటే విమర్శలా?
- ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): హైడ్రా చేపట్టిన టిన చర్యలతో కొందరు భూ కబ్జాదారులకు నిద్రపట్టడం లేదని, అందుకే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు.
కబ్జాదారులపైన హైడ్రా యుద్దమే చేస్తోందన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించాల్సిందిపోయి కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారని, భూ కబ్జాదారులకు వంత పాడుతున్నారని వీహెచ్ మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జాలకు గురైన చెరువులు, కుంటలతో పాటు పార్కులను రక్షిస్తున్నారని వీహెచ్ తెలిపారు.






