దేవాలయం నందు తాగునీటి అవసరాల కోసం బోరు మోటర్ ఏర్పాటు
11-04-2026 04:22 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త తండా అభయాంజనేయ స్వామి దేవాలయం నందు తాగునీటి అవసరాల నిమిత్తం కాల్వపల్లి తండా గ్రామ పంచాయతీ నిధుల నుండి సర్పంచ్ మాలోతు సక్రు నాయక్,కొత్త దొనబండ తండా సర్పంచ్ బానోతు అరుణ దేశ్ పాండు నాయక్ శనివారం బోరు పాయింట్ ని గ్రామ పెద్దలతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. దాదాపుగా రెండు అంగుళాలు నీరు పడడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బానోతు లక్ష్మీ భరత్ నాయక్, దేవాలయం కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు,ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




