2 June, 2026 | 9:04 PM

అంబేద్కర్ చిత్రపటం లేకపోవడం బాధాకరం

02-06-2026 08:29 PM

బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాల వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి మహేందర్, బోనగిరి రూపేష్ లు తీవ్రంగా ఖండించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని కల్పించిన అంబేద్కర్, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కూడా మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడిని తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో విస్మరించడం బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాల్లో అంబేద్కర్ చిత్రపటానికి తగిన స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.