బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
02-06-2026 08:32 PM
బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.






