కిషన్ రావుపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి
ధర్మపురి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న శైలేందర్ రెడ్డికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
అనంతరం పిట్టల లక్ష్మణ్, వీరేశంలు శైలందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శైలేందర్ రెడ్డితో పాటు మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి, వెల్గటూర్ మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, ఉపసర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు,మాజీ ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు దుంపటి సత్యం, ముచ్చర్ల రాజేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్క లక్ష్మణ్, మన్నే జితేందర్, ఉపసర్పంచ్ తనుగుల విజయ్, కొత్తపల్లి రాజు, కుమ్మరి వెంకటేష్, ప్రసాద్, నేరెళ్ళ బుచ్చయ్య పాల్గొన్నారు.




