8 June, 2026 | 3:59 PM

'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం

28-03-2026 03:54 PM

అంగన్‌వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్" తొలి ముద్ద " ప్రారంభం

దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది.. కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదు.

బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే... తల్లికి పౌష్టికాహారం

హైదరాబాద్‌: అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో, అంగన్‌వాడీ పిల్లల కోసం అల్పాహార పథకం(Breakfast Scheme) ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా తొలి ముద్ద పథకాన్ని సీఎం రేవంత్ రెడి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీతాదయాకర్ రెడ్డి పాల్గొన్నారు. రెడీ టూ కుక్ ఫుడ్( ఉప్మా, కిచిడీ మిక్స్)ను తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) బ్రేక్ ఫాస్ట్ గా అందించనుంది. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లకు సీఎం మొబైల్ ఫోన్ల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయటం వెనుక సహేతుక కారణం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదని తెలిపారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల బాగుంటుందని తెలిపారు.

అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందన్నారు. అంగన్‌వాడీ(Anganwadi) సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదన్న ఆయన అంగన్‌వాడీ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించే చర్యలు చేపట్టామని వెల్లడించారు. పౌష్టికాహారం లేకపోవడం వల్లే పిల్లలకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.