13-02-2026 03:50:18 PM
మోతె,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహ శంకుస్థాపన శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. పల్లెల పరివర్తన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దోసపాటి అనురాధ, ఉప సర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డి లు పూలే విగ్రహ శంకుస్థాపన చేసిన అనంతరం వారు మాట్లాడారు. మహాత్మా జ్యోతి రావు పూలే చరిత్ర కారుడని పూలే చరిత్ర ను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని పూలే జీవితం బావి తరాలకు స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లెల పరివర్తన సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ పల్లెల, వార్డు సభ్యులు వీరబాబు, తరుణ్, నవీన్, యశోద, మాదవి, భద్రమ్మ, రమేష్, కమిటీ సభ్యులు యల్ యన్ రాజు, రాము, తదితరులు పాల్గొన్నారు.