16 April, 2026 | 1:59 AM

అంబేద్కర్ జయంతి రోజు దళితులకు అవమానం

16-04-2026 12:00 AM

అధికారిక కార్యక్రమంలో ప్రజా సంఘాలకు దూరం పెట్టడం దేనికి సంకేతమో..? 

తాండూరు, ఏప్రిల్ 15,(విజయక్రాంతి) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు న వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో జరిగిన  వేడుకల్లో ప్రజాసంఘాలకు, దళిత సంఘాలకు అవమానం జరిగిందని అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పాత తాండూరు అంబేద్కర్ పార్క్ లో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో దళితుల పేర్లు ఆహ్వాన పత్రిక లో ప్రచురించలేదని కనీసం ఆహ్వానం కూడా పంపలేదన అధికారుల తీరు పట్ల తీవ్రంగా  ఖండించారు. కమిషనర్ పై చర్య తీసుకోవాలని దళిత  సంఘాలు డిమాండ్ చేశాయి.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలోనే ఈ వివక్ష జరగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దీనిపై తక్షణ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు  సిఐటియు  శ్రీనివాస్, మల్కయ్య,  కే చంద్రయ్య, మొహమ్మద్ సాధిఖ్, రవి, దళిత మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.