18 August, 2026 | 1:21 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

టిపిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి కృషితో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు

24-05-2026 03:51 PM

బోథ్(విజయక్రాంతి): తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నదని బొత్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో టీ సీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు కండ్ల లాంటి వారన్నారు. సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత టిపిసిసి అధ్యక్షుల సమన్వయంతో పేద ప్రజల సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్ర రైతుల కోసం సంక్షేమ పథకాలు ఎన్నింటినో అమలు చేస్తున్నారన్నారు.