15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

13-12-2025 06:09 PM

మాగనూరు: స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మాగనూరు మండలంలో వివిధ పార్టీలకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు నాయకులు ముమ్మరముగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలో సర్పంచ్ ఎన్నికలు త్రిముఖ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరుగుతున్నది. మాగనూరు మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరుగుతున్నది. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం ముమ్మరంగా చేయుచున్నారు. సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఎన్నికల గుర్తు చూయిస్తూ ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మేము గెలిస్తే గ్రామాభివృద్ధి చేస్తాం ఎమ్మెల్యే ఎంపీ నిధుల ద్వారా గ్రామాల అభివృద్ధి చేస్తామని అభ్యర్థులు ప్రజలకు హామీలు ఇస్తున్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, పోటీలో నువ్వా నేనా అనే విధముగా ప్రచారము జోరుగా సాగిస్తున్నారు. ఉదయం టిఫిన్ ,మధ్యాహ్నం భోజనం రాత్రిపూట మద్యంతో ఓటర్లను ప్రలోభపరుస్తున్నారు, ఓటర్లకు గ్రామ అభివృద్ధి గురించి హామీలు ఇస్తూ, ఎన్నికల్లో మహిళ అభ్యర్థులు తదితరులు ఇంటింటికి ప్రచారం ముమ్మరముగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ప్రచారానికి కొన్ని గ్రామాల్లో కూలీలకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయిస్తున్నారని ఆయా గ్రామ ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు గెలుపు లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు  పోటాపోటీగా ఇంటింటికి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలోకీ ఓటర్స్ ను కలిసి వారి దగ్గర హామీలు తీసుకుంటున్నారు. ఎన్నికలు జరిగేంతవరకు ఓటర్ మహాశయులకు ఇది ఒక పండుగ వాతావరణం లాగా కనిపిస్తుందని మండల ప్రజలు అంటున్నారు.