13-12-2025 06:08:18 PM
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించండి..
డీసీసీబీ ఆడ్డి బోజా రెడ్డి...
తలమడుగు,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని డీసీసీబీ చైర్మన్ ఆడ్డి బోజా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఆడే గజేందర్ లు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని బరంపూర్, తలమడుగు, కజ్జర్ల, సుంకిడి గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ ఆడ్డి బోజారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందన్నారు. బరంపూర్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఇన్చార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా బరంపూర్ గ్రామంలో ఎన్నికలు లేవని, ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు గణేష్ రెడ్డి, బాబన్న, పార్టీ కన్వీనర్ కల్యాణం రాజేశ్వర్, ఎల్మా నారాయణరెడ్డి, ఏల్పుల శివ, సీడం లక్ష్మణ్, నడిపెన్న, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పోతారెడ్డి, ప్రతాప్, వెంకన్న యాదవ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.