19 July, 2026 | 2:14 AM

అంతర్ జిల్లా బైకు దొంగల ముఠా అరెస్ట్

19-07-2026 12:00 AM

9 వాహనాలు స్వాధీనం 

మేడ్చల్, జూలై 18 (విజయక్రాంతి): అంతర జిల్లా బైకు దొంగల ముఠాలను షామీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసిపి చక్రపాణి షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పాత నేరస్థుడు నల్లగండ్ల నవీన్ రాజ్, మరో ముగ్గురు మైనర్లు ముఠాగా ఏర్పడి బైక్ చోరీలు చేస్తున్నారు. షామీర్పేట్ జవహర్ నగర్ కీసర పేట బషీరాబాద్ ఖమ్మం జిల్లా మధిర పోలీస్ స్టేషన్లో పరిధిలో చోరీలు చేశారు.

పక్కా సమాచారం మేరకు నిందితులను పట్టుకొని విచారించాగా నేరాన్ని అంగీకరించారు. వీరి వద్ద మొత్తం తొమ్మిది వాహ నాలు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించారు. మైనర్లు కూడా పాత నేరస్తులే. జైలలో వీరికి పరిచయం ఏర్పడి బయటకు వచ్చిన తర్వాత వాహనాలు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. వాహనదారులు తమ వాహనాలకు లాక్ చేసే సమయంలో నిర్లక్ష్యం చేయవద్దని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసిపి సూచించారు. వాహనాల దొంగల ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన షామీర్పేట్ ఎస్ హెచ్ ఓ నరసింహారెడ్డి, ఎష్‌ఐలను ఏసిపి అభినందించారు.