దమ్మాయిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఘటనా స్థలంలోనే 13 ఏళ్ల బాలుడు మృతి
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జవహర్ నగర్, జులై 18 (విజయక్రాంతి): జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ భార త్ పెట్రోల్ పంపు సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... దమ్మాయిగూడ లోని శివనగర్ లో మహమ్మద్ సిరాజ్ దంపతులు ఇద్దరు పిల్లలతో టైలరింగ్ పని చేసుకుంటూ నివసిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం సిరాజ్ చిన్న కుమారుడు సుఫియాన్ (13) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు.
ఈ మేరకు శనివారం సుఫియాన్ ను స్కూల్లో దింపి రావడానికి పెద్ద కుమారుడు సైఫ్ సోదరున్ని స్కూటీపై దించి రావడానికి అని వెళుతుండగా మార్గ మధ్యలో లేబర్ అడ్డా వద్ద గుర్తుతెలియని ఇసుక లారీ అతివేగంగా నిర్లక్ష్యంగా స్కూటీని ఢీకొట్టడంతో సుఫియాన్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిం పింది. మృతుడు సెయింట్ ఆంథోనీ గ్రామ ర్ స్కూల్ విద్యార్థి. ప్రమాద సమయంలో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






