03-02-2026 12:59:04 AM
సనత్‌నగర్ ఫిబ్రవరి 2 (విజయక్రాంతి):- సనత్‌నగర్ డివిజన్ శ్యామ లకుంట లక్ష్మణ్ నగర్ బస్తీలో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొ ని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సనత్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్యామలకుంట బస్తి అధ్యక్షులు దళితరత్న అవార్డు గ్రహీత పుట్టల శేఖర్ ఎమ్మెల్యే తలసానికి శాలువాలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వేడుకలలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ నామాన శేషు కుమారి, డివిజన్ అధ్యక్షులు కోలను బాల్ రెడ్డి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, సుభాష్ నగర్ కైలాస్ నగర్ ప్రెసిడెంట్ భోగి బాలరాజ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.