అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
- రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు రవాణా
- మియాపూర్, సైఫాబాద్ పరిధుల్లో దాడులు
- ఏడుగురు అరెస్టు
- రూ.12.65లక్షల సరుకు సీజ్
- 78 సార్లు డ్రగ్స్ సరఫరా ముఠా
శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవా ణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులు అరెస్టు చేశా రు. మియాపూర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరుగా దాడులు చేసి మొత్తం ఏ డుగురిని అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెంది న మహేందర్ మావత్ ఈ నెట్వర్క్‌కు ప్ర ధాన సరఫరాదారుగా ఉన్నాడు. నిందితులు ప్రైవేటు బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో డ్రగ్స్‌ను నగరానికి తరలించేవారు.
తనిఖీలను తప్పించుకునేందుకు ప్రత్యేక క్యారియ ర్లు, డెలివరీ ఏజెంట్లు, మధ్యవర్తులను ఏర్పా టు చేసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 78 సార్లు నగరానికి డ్రగ్స్ తెప్పించినట్లు వి చారణలో తేలింది. ఈ దాడుల్లో రూ.12.65 లక్షల విలువైన 1.031 కిలోల ఓపిఎం, 25 గ్రాముల మెఫెడ్రీన్ ఎండీని పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. మియాపూర్ కేసులో మధురామ్, మహేంద్రపటేల్, ధర్మేంద్రలను, సైఫాబాద్ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఎండీ తయారు చేస్తున్న కొన్ని రహస్య స్థావరాలను ఈగల్ ఫోర్స్ గుర్తించి ధ్వంసం చేసింది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం, వీరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వినియోగదారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.






