9 August, 2026 | 3:34 AM

పరిహారం వివాదంలో వేధింపులు

09-08-2026 01:25 AM
  1. దంపతుల ఆత్మహత్యాయత్నం
  2. కామారెడ్డి జిల్లాలో ఘటన

బిక్కనూర్, ఆగస్టు 8(విజయ క్రాంతి): పరిహారం ఇచ్చే విషయంలో ఏర్పడిన వివాదం, వేధింపుల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్‌కు చెందిన కుర్మిండ్ల శ్రీనివాస్ గౌడ్, ఆయన భార్య శ్రీలత శనివారం ఉదయం ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జూన్ 25న బస్వాపూర్ సమీపంలో ఆటో, కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో రమేశ్ గౌడ్ మృతి చెందగా, ఆటో డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్‌కు రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని మృతుడి బంధువు కాసాల సత్యాగౌడ్ తో పాటు గ్రామ పెద్దలు ఒప్పందం కుదురుచ్చారు. ఈ వ్యవహారంలో సిద్ధరామేశ్వరనగర్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అతని బావను మధ్యవర్తిగా తీసుకున్నట్లు తెలిసింది. పరిహారం చెల్లింపు లో భాగంగా శ్రీనివాస్ గౌడ్ రూ.లక్ష చెల్లించి, మిగిలిన మొత్తాన్ని గడువులోగా చెల్లిస్తానని చె ప్పారు. గడువు ముగిసినా మిగిలిన మొత్తం చెల్లించలేకపోవడంతో మరికొద్ది రోజులు సమ యం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.

అయితే సమయం ఇవ్వకపోగా, తన బావను కాసాల సత్యాగౌడ్ ఇష్టానుసారం దూషిస్తూ మాట్లాడినట్లు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తనపై ఒత్తిడి, వేధింపులు జరిపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌గౌడ్ సూసైడ్ నోట్‌లో కాసాల సత్యాగౌడ్ తనను తీవ్రంగా వేధిస్తున్నారని, తన మృతికి ఆయనే కారణమని పేర్కొంటూ.. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొ న్నారు. అనంతరం దంపతులు ఇద్దరు విషం తాగగా, స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్‌గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.