19 March, 2026 | 8:20 AM

చిలకలగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

19-03-2026 02:06 AM

సికింద్రాబాద్, మార్చి18, (విజయక్రాంతి): సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోవిషాద ఘటన చోటుచేసుకుంది. జెమిని (19) అనే ఇంటర్ విద్యార్థిని సూసైడ్‌కు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  జగదీష్ అనే యువకుడు తన కుమార్తెను కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించా రు. ఇంట్లో జెమిని ఒంటరిగా ఉన్న సమయంలో ఆ యువకుడు ఇంటికి వచ్చి దాడి చేశాడని,

ఆ సంఘటనతో భయభ్రాంతులకు గురై న జెమిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె పేర్కొన్నారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిం దితుడిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యు లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.