16 April, 2026 | 9:04 AM

రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

15-06-2025 12:02 AM

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లి మెంటరీ ఫలితాలు సోమవారం మ ధ్యాహ్నం విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 29 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.