calender_icon.png 20 January, 2026 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

20-01-2026 01:02:32 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఖానాపూర్, జనవరి ౧9 (విజయక్రాంతి): మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు మహి ళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు  ఎమ్మల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం మెప్మా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణా ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఖానాపూర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు రూ.13,22,827వడ్డీ లేని రుణాలు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం పని చేస్తుందని, ఇప్పటికే ఉచిత బస్, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లులు, పెట్రోల్ బంకులు, బస్సులకు ఓనర్లను చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళ శక్తి వివో లు, మహిళ శక్తి లీడర్ లు, పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కష్టపడి పని చేసే వారికి అవకాశం.. 

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లిన ప్రతీ కార్యకర్తకు తప్పనిసరిగా రాజకీయ అవకాసం కల్పిస్తామని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే  బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూ ర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాదులతో సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ స్థానాలకు పోటీ ఎక్కువగా ఉందని అందులో ప్రజాబలం ఉన్న వారిని సర్వే ద్వారా గుర్తించి టికెట్లు ఇస్తామని, పార్టీ నేతలు నిరాశ చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.