20-01-2026 01:02:49 AM
జూబ్లీహిల్స్ పీఎస్‌లో 11 గంటలకు హాజరవ్వాలని ఆదేశం
బీఆర్‌ఎస్ భవన్ నుంచి విచారణకు వెళ్లనున్న హరీశ్!
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఎజెండా అన్న బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో మొదటిసారిగా బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. 160సీఆర్‌పీసీ కింద నోటీసులను ఆయన నివాసంలో సిట్ అధికారులు అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటల కు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని అసమ్మతి నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ల ను అక్రమంగా ట్యాప్ చేశారన్న అభియోగాలపై సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలి సిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సీనియర్ పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యా రు. వారిని విచారించిన సందర్భంగా సేకరించిన కీలక సమాచారం, వాంగ్మూలాల ఆధా రంగానే హరీశ్‌రావుకు నోటీసులు జారీచేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. హరీశ్ రావు విచారణకు హాజరవుతారా? లేక న్యా య నిపుణులను సంప్రదిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
9 గంటలకు బీఆర్‌ఎస్ భవన్‌కు కేటీఆర్, హరీశ్, నేతలు
సిట్ నోటీసుల జారీ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ శ్రేణు లు బీఆర్‌ఎస్ భవన్‌కు చేరుకోనున్నారు. అందుబాటులో ఉన్న నేతలు, నాయకులు రావాలని బీఆర్‌ఎస్ పిలుపు ఇచ్చింది. అక్క డి నుంచి హరీశ్‌రావు సిట్ విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఏకైక ఎజెండాగా మారిందని, పోన్‌ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని సుప్రీంకోర్టు చెప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు అని కోర్టు చెప్పడమే కాకుండా కేసు ను కొట్టివేసిందని చెప్పారు.
చౌకబారు బెదరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విచారణల పేరుతో ప్రతిపక్షం గొంత నొక్కాలని చూడ టం మీ భ్రమేనని, కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. కోర్టు తీర్పుతో డ్రామా ముగిసినా, హరీశ్‌రావుకు మళ్లీ నోటీసులు ఇవ్వడమేంటి అని నిలదీశా రు. సృజన్‌రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుం భకోణం నుంచి దృష్టి మరల్చేందుకే హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం సిట్ విచారణతో భయపె ట్టాలని చూస్తోందని, బొగ్గు గనుల కుంభకోణం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.