20-01-2026 12:59:22 AM
సమీక్ష సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యే రామారావు పటేల్
బైంసా, జనవరి ౧9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసర ఆలయంలో ఈనెల 23న జరిగే వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆలయంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ సబ్ కలెక్టర్ సాయి సాంకేత్ కుమార్ ఆలయ నిర్వహణ అధికారి అంజలి దేవితో సమీక్ష నిర్వ హించారు.
ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అక్షరాభ్యా సం భక్తుల క్యూ లైన్లు తాగునీటి సౌకర్యం లడ్డు ప్రసాదాల వితరణ ట్రాఫిక్ సమస్య పరిసరాల పరిశుభ్రత గోదావరి పుష్కర్ల గాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సింది జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వృద్ధులకు గర్భిణీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ రక్షణ చర్యలు తీసుకోవాలని భక్తుల రద్దీ తగ్గించేందుకు చేపట్టవల సిన చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ధర్మకర్తలు పాల్గొన్నారు.