02-02-2026 05:04:33 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం మండలంలోని చినుర్ గ్రామానికి చెందిన మేకల మాధవినీ నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల మహిళా నూతన అధ్యక్షురాలుగా నియమించినట్లుగా ఆర్డర్ కాపీని అందజేయడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తనపై నమ్మకంతో మండల మహిళ నూతన అధ్యక్షురాలుగా నియమించినందుకు ఎమ్మెల్యేకు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తన పదవిని సక్రమంగా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వివరిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి,ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య,సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, గంపల వెంకయ్య,ఈమామ్, రామకృష్ణ,మహేష్ రెడ్డి,కొండ కృష్ణ,జయరాములు, రాములు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.