calender_icon.png 5 May, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్నల్ మార్కులు, గ్రేడింగ్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలి

24-04-2025 12:51:45 AM

  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కే.కృష్ణారావుకు వినతి

తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి

ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): 2024-25 విద్యా సంవత్సరానికి ఎస్.ఎస్.సీ విద్యార్థుల కోసం మూల్యాంకన విధానంలో ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టిన మార్పుల దృష్ట్యా ఎస్.ఎస్.సీ విద్యార్థుల కోసం ఇంటర్నల్ మార్కులు, జీపీఏ గ్రేడింగ్ వ్యవస్థను తిరిగి యధావిధిగా   కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కె. కృష్ణా రావుకు, పాఠశాల విద్య డైరెక్టర్ లకు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే. అనిల్ కుమార్, కోశాధికారి కె. శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బుధవారం వారు వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం మీడియాతో  మాట్లాడారు ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ  మార్కుల విధానం తిరిగి ప్రవేశపెట్టడంతో, విద్యార్థులు ఇప్పుడు మా నసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పనితీరు ఫలితం గురించి ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ మార్కుల కేంద్రీకృత విధానం కొన్ని కార్పొరేట్ సంస్థలచే పోటీ, దోపిడీకి దారితీయవచ్చన్నారు.

వారు అడ్మిషన్ ప్రయోజనాల కోసం పరిస్థితిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండన్నారు. దీని వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. మునుపటి అంతర్గత మార్కులు, జీపీఏ గ్రేడింగ్ విధానం విద్యా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడిందన్నారు. విద్యార్థులలో సామాజిక సమానత్వాన్ని, తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిందన్నారు. అందుకోసం గ్రేడింగ్ విధానాన్ని యధావిధిగా కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.