24-04-2025 12:52:18 AM
మేడ్చల్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం లేకపోవడంతో చెట్టు కింద కూర్చుని ప్రజా సమస్యల తెలుసుకుంటూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిరసన తెలిపారు. అక్కడే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలనుంచి దరఖాస్తుల స్వీకరించారు.
క్యాంపు కార్యాలయం గురించి కలెక్టర్ కు విన్నవిస్తే, జిహెచ్‌ఎంసి కమిషనర్ ను కలవాలని, డిప్యూటీ కమిషనర్ను కలవాలని తిప్పుతున్నారని మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యక్తిగత సహాయకుని కేటాయించాలని అసెంబ్లీ సెక్రటరీ, జి ఏ డి అధికారులను కోరిన పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మురుగేష్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, అమీనుద్దీన్, రాము యాదవ్, చిన్న యాదవ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.