18-01-2026 12:00:00 AM
ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహణ
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాలలో జనవరి 19, 20 తేదీలలో రెండు రోజుల పాటు “నావిగేటింగ్ కంప్లెక్సీటిస్ ఇన్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీ త్రో వికసిత్ భారత్ 2047” అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. తెలంగాణ అధ్యాపకుల కోసం మొదటి రోజు ప్రత్యక్ష పద్ధతిలో, ఇతర ప్రాంతాల వారికోసం రెండవ రోజు అంతర్జాలం ద్వారా సదస్సు నిర్వహిస్తున్నారు. కామర్స్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్, కం ప్యూటర్ సైన్స్, తెలుగు, సంసృ్కతం, హిందీ, ఇంగ్లీష్ సాహిత్యం, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాలకు సంబంధించిన 75 వ్యాస సంగ్రహాలు, పూర్తి పరిశోధనా పత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా పరిశోధకులు పంపించారు.
75 వ్యాస సంగ్రహాలతో కూడిన సంకలనాన్ని (సావనీర్) సదస్సు రోజు ఆవిష్కరిస్తామని కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ తెలియజేశారు. సదస్సుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగం పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఆచార్య పాట్రిక్ పాల్గొంటారని, హైద రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగ ఆచార్యులు చేతన్ శ్రీ వాత్సవ సదస్సునుద్దేశించి కీలకోపన్యాసం ఇవ్వనున్నారని తెలిపారు. సదస్సు కు అధ్యాపకులు, పరిశోధకులు అధిక సంఖ్య లో విచ్చేసి సదస్సు విజయవంతం చేయాలని కళాశాల డీన్లు డా డి. తిరుమలరావు, డా.జి. సంతోషి, సదస్సు సంచాలకులు, వా ణిజ్య శాస్త్ర సహాయ అధ్యాపకురాలు సముద్రాల శ్రావణి, సదస్సు సహా సంచాలకు రాలు లైబ్రేరియన్ డా.జి. రమాదేవి కోరారు.