18-01-2026 12:00:00 AM
జవహర్ నగర్, జనవరి 17 (విజయక్రాంతి): ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన కథనం ప్రకారం... గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లోని లక్ష్మినర్సింహాకాలనీలో లింగాల పుష, భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తుంది. కుమార్తె యమ్లాల నవీనాకు వివాహం కాగా ఇద్దరు పిల్లలు పుట్టారు.
భర్త శ్రీధర్, నవీనా 7సంత్సరాలలోపు ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి ఈ నెల 13న లక్ష్మినర్సింహాకాలనీలోని పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో భార్యభర్తలకు గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్థాపం చెందిన నవీనా ఈ నెల 16న ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో నవీనా(27) ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.