సింగరేణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
ఇల్లెందు, డిసెంబర్ 3,(విజయక్రాంతి):అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భముగా ఇల్లందు ఏరియా బ్లాక్ డైమోండ్ స్టేడియం లో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య పాల్గొని క్రీడలను ప్రారంభించినారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ..
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడం కోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై, 1998 నుండి ప్రతి సంవత్సరం దివ్యాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది.
దివ్యాంగులను ప్రతి ఒక్కరు ఆదరించాలని వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తూ ప్రోత్సాహాన్ని అందించాలని అలాగే అవయవాలు లేక పోయిన ఆలోచనలో ఎవరికి తీసిపోమని నిరూపించారన్నారు. ఈ సంవత్సరం ’అంగవైకల్యాన్ని అధిగమించి అందరితో సాగిపో’ అనే నినాదంతో సాగిపోవలన్నారు. సింగరేణి కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దివ్యాంగులకు పోటీలను నిర్వహించి వారిలో మానశిక దైర్యాన్ని కలుగచేస్తున్నదని అన్నారు.
అనంతరం క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించినారు. ఈ కార్యక్రమంలో డీజీఎం(పర్సనల్) అజ్మీర తుకారాం, సింగరేణి పాఠశాల హెచ్.యం. బి.శ్రీనివాస్, యాన్.పి.ఆర్.డి. ప్రెసిడెంట్ టి.ప్రవీణ్ కుమార్, సెక్రెటరి సి.హెచ్. రాజేందర్, మరియు తదితరులు పాల్గొన్నారు.




