calender_icon.png 3 December, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమావళిపై గ్రామ ప్రజలకు అవగాహన

03-12-2025 11:02:49 PM

తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిలో పాటించాల్సిన జాగ్రత్తలు అతిక్రమణుల గురించి డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో జరగబోతున్న అక్రమాలపై పోలీసులకు తక్షణమే ఫిర్యాదు అందజేయాలని ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని వివరించారు. నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు పోటీ చేసే వారికి విధి విధానాలను వివరించారు. ఇందులో సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందం, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.