17 April, 2026 | 11:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

యోగా దినోత్సవం విజయవంతం చేయాలి

20-06-2025 11:25 AM

 బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు.

హుజురాబాద్:(విజయక్రాంతి): యోగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, బిజెపి పట్టణ శక్తి కేంద్ర ఇన్చార్జ్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్ లో  శుక్రవారం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికసిత్ భారత్, సేవ సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ  నాయకత్వంలో ప్రతి సవాల్ని ధైర్యంగా ఎదుర్కొని ప్రపంచంలో అణిచిత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ప్రధాని మోడీ(Indian Prime Minister Modi) నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు.

స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఆకాష్ బ్రహ్మోస్ భారత్ జవాన్లు సమర్ధవంతరంగా ఉపయోగించిందన్నారు. ఎగుమతులు 34 రెట్లు పెరిగాయి అన్నారు దేశ మొత్తం వికసిద్భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా భారత్ మోడీ నాయకత్వంలో ముందుకెళుతుందన్నారు. 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లె వీరయ్య, బొడ్డు మహేష్, తిప్పబత్తిని రాజు,  మల్లారెడ్డి, శృతి, ఐలయ్య, మొగిలి, రాజిరెడ్డి,చంద్రమౌళి, గోస్కుల పోచయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.