13 May, 2026 | 2:13 AM

ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

13-05-2026 12:50 AM

ఆమనగల్లు, మే 12 (విజయక్రాంతి): ఆమనగల్లు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్  లో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని, సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా వైద్యరంగంలో అంకితభావంతో సేవలందిస్తున్న హెడ్ నర్సులు మరియు నర్సింగ్ ఆఫీసర్లను డాక్టర్ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఉత్తమ సేవలు కనబరిచిన వారికి ’ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగాడాక్టర్ నాగరాజు మాట్లాడుతూ..రోగులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారికి పునర్జన్మను ప్రసాదించడంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిది. వారి నిబద్ధత, నిస్వార్థ సేవలు ఆరోగ్య రంగానికి వెన్నెముక వంటివి. అలుపెరగని శ్రమతో వారు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం అని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి, హెడ్ నర్సులు ఏసు మణి, రత్నజ్యోతి, హేక్సీ బాసు, నీత, అలివేలు, సాయి లత, కృష్ణ లీల, సంపూర్ణ, రేణుక, మధు, సత్య, మునీరా, పూజ తదితరులు పాల్గొన్నారు.