13 May, 2026 | 2:13 AM

పందుల బెడదను నివారించాలి

13-05-2026 12:49 AM

ఆమనగల్లు, మే 12 (విజయక్రాంతి): ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో పందుల బెడదను అరికట్టాలని కోరుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాళ్ల రవీందర్, రమేష్ గౌడ్ లు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, ఎస్త్స్ర సీతారాం రెడ్డిలకువేరు వేరు గా వినతిపత్రం అందజేశారు.

కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పందులు పాడుచేస్తున్నాయని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని డైరెక్టర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్ పరిసరాల్లో పందుల సంచారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.