న్యాయ రంగంలో అంతర్జాతీయ అవకాశాలు
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జనేత రెడ్డి కంచర్ల
సికింద్రాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ విభాగం నేడు చారిత్రాత్మక ఠాగూర్ ఆడిటోరియంలో న్యాయ రంగంలో అంతర్జాతీయ అవకాశాలు - అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ రెండో విడత పాలనలో ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ పోకడలు అనే అంశంపై ఒక విశేష సదస్సును విజయ వంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వివిధ న్యాయ రంగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, వృత్తి నిపుణులు, అమెరికాలో అటార్నీ-అట్-లా గా విశేష అనుభవం ఉన్న జనేత రెడ్డి కంచర్ల ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనేత రెడ్డి కంచర్ల మాట్లాడుతూ గ్లోబలైజేషన్, సరిహద్దుల దాటి జరుగుతున్న వాణిజ్యం కారణంగా కార్పొరేట్ లా,మేధో సంపత్తి , ఇమ్మిగ్రేషన్ లా, టెక్నాలజీ లా, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ వంటి విభాగాల్లో న్యాయ నిపుణులకు విదేశాల్లో పెరుగుతున్న అవకాశాల గురించి ఆమె వివరించారు. అనంతరం, లా ఫ్యాకల్టీ డీన్ జనేతరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, విద్యార్థులు అంతర్జాతీయ విధానాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఆఫ్ డీన్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాంప్రసాద్, ఇతర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




