13-02-2026 12:49:28 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 : క్రీడారాజధాని హైదరాబాద్ మరో అంతర్జాతీయ పో టీలకు వేదికైంది. హైదరాబాద్ పోలో రైడిం గ్ క్లబ్ వేదికగా ఇంటర్నేషనల్ అరెనా పోలో చాంపియన్ షిప్ మొదలైంది. వారం రోజు ల పాటు జరగనున్న ఈ పోటీల్లో భారత్, యూఎస్‌ఏ, జర్మనీ, ఫ్రాన్స్, లక్సంబర్గ్ పాల్గొంటున్నాయి. ప్రముఖ సంస్థ రాధా టీఎంటీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
కాగా ఈ సీజన్‌లో 4 టోర్నమెంట్, 6 టోర్నమెంట్‌తో పాటు రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్టు హెచ్ పీఆ ర్ సీ ప్రెసిడెంట్ చైతన్య చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న హెచ్ పీఆర్ సీ పోలో గ్రౌండ్స్, ఇతర సౌకర్యాలపై విదేశీ క్రీడాకారులు ప్రశంసలు కురిపించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో పోలో క్రీడకు మరింత ఆదరణ పెంచే లక్ష్యం తో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ టూరిజం ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని హెచ్ పీఆర్ సీ సెక్రటరీ రియాజ్ అహ్మద్ తెలిపారు. కాగా ఈ పోటీల్లో భాగం గా లేజర్ షో, వింటేజ్ కార్స్ , బైక్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడిం చారు. మహిళ క్రీడాకారులతో ప్రత్యేక మ్యా చ్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ పోలో ఛాంపియన్‌షిప్‌లో తాము కూడా భాగం కావడం సంతోషంగా ఉందని రాధా టీఎంటీ ఎండీ అక్షత్ సరాఫ్ చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత జట్టుకు యూ సఫ్ అజ్మి కెప్టెన్‌గా ఉన్నారు.