ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
09-03-2026 12:21 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం గ్రామ సర్పంచ్ కర్నాటి వెంకన్న ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయితీ కార్యాలయం స్థలదాత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మోర ఆనంద, మహిళా ప్రజా ప్రతినిధులు మాగి మీనాక్షి, ముచ్చపోతుల సరిత, తవిటి శారద, ముఢావత్ స్రవంతి, అంగన్వాడీ టీచర్ రామసాని విజయ,ఆశా కార్యకర్త గంట జయమ్మలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగంపల్లి రవిందర్, వార్డు సభ్యులు తవిటి సైదులు, ముఢావత్ తనేష్, నాయకులు తవిటి నాగరాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




