7 July, 2026 | 2:56 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

07-03-2026 12:34 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): పట్టణంలోని గాంధీ పార్క్‌లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు .సందర్భంగా ముందస్తుగా  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దండే విఠల్, సి & డీఎంఏ హైదరాబాద్ నుండి ప్రత్యేక అధికారి సాయి హాజరయ్యారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ షహీన్ సుల్తానా, వైస్ చైర్‌పర్సన్ డా. కొత్తపల్లి అనిత,  డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.బి. రామాదేవి లను సన్మానిచారు.సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

మహిళా సాధికారత కేవలం ఆర్థికాభివృద్ధితోనే కాకుండా సామాజిక చైతన్యంతో కూడా సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు.అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి,టీఎంసీ ఉషా, సి.ఓ రేణుక, మున్సిపల్ సిబ్బంది, ఆర్‌పీలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.