15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చందానగర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

06-04-2025 12:15 AM

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధి లోని క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగిన పి.ఆర్.కె చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన  మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి  సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానంచేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, అన్నారు. మహిళల కోసం  సంస్కృతిక ప్రదర్శనలు, నిరుపేద మహిళలకు చీరల పంపిణీ, వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా అభినదించదగ్గ విషయం అని,  మహిళలు వంటింటికె పరిమితం కాకుండా అంది వచ్చిన అవకాశాలను పునికిపుచ్చుకొని అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిలీచీ ఆర్థిక స్వాలంబన పొందాలని తెలియచేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు, కార్యకర్తలు మహిళ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.