12 March, 2026 | 10:56 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అణగారిన కులాల గొంతుక జగ్జీవన్‌రామ్

06-04-2025 12:13 AM

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దేశంలోని అణగారిన కులాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. దళితోద్యమ నేత, సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్బంగా బషీర్ బాగ్ లోని అయన విగ్రహానికి డాక్టర్ దిడ్డి సుధాకర్, ఆప్ రాష్ట్ర నేతలు డా. లక్ష్య నాయుడు, రాకేష్ రెడ్డి, అజీమ్ బేగ్, శహబాజ్, ఎస్.ఎన్. రెడ్డి, మోనికా తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ 1935లో బాబు జగ్జీవన్ రామ్  ఇండియన్ డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించి, అణగారిన ప్రజలకు, సామాజిక న్యాయం, సమానత్వం మరియు సంక్షేమం కోసం అనేక ఉద్యమాలను నిర్వహించడాన్ని గుర్తు చేసారు.

భారత పార్లమెంట్ లో సామాజిక న్యాయ సూత్రాలను బలంగా నొక్కి చెప్పారని తెలిపారు. సామాజిక అణచివేత మరియు కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ పిలుపునిచ్చారు.