24 August, 2026 | 9:53 PM

Breaking News

చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •  

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

16-06-2025 05:37 PM

మందమర్రి (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవ(International Yoga Day) వేడుకలు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో సోమవారం యోగా దినోత్సవం పురస్కరించుకొని ఏరియా జియం జి దేవేందర్(Area GM G Devender) యోగ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మానవులు తమ దైనందిన జీవితంలో ప్రతి రోజూ ఒక గంట సమయాన్ని యోగాకు కేటాయించి యోగ సాధన చేయాలని తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉంటేనే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఆరోగ్యంగా ఉంటామన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి ఉద్యోగులు యోగా సాధన చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సింగరేణి సంస్థలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉత్పత్తి ఉత్పాదకత, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏఐటియుసి స్ట్రక్చర్ కమిటీ మెంబర్  సివి రమణ, సివిల్ డిజిఎం రాము, ఐఈడి ఎస్ఈ కె కిరణ్ కుమార్, డివైపిఎం ఆసిఫ్, ఫారెస్ట్ అధికారి రమణారెడ్డి, ఐటి డిప్యూటీ మేనేజర్ రవి, జిఎం కార్యాలయం అదికారులు, సిబ్బంది పాల్గొన్నారు.