23 June, 2026 | 8:12 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి

23-06-2026 07:16 PM

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యంచేసే కుట్రలని తిప్పికొడతాం

 బికెఎంయు జిల్లా నాయకులు రేసు ఎల్లయ్య, పూర్ణచందర్ రావు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనిలో వి బి జీ రాంజీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఉపాధి కార్మికుల హక్కులను కాపాడాలనివ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు) జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు ఎల్లయ్య, అధ్యక్షులు వి పూర్ణచందర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని పునరుద్ధరించి పటిష్టంగా అమలు చేయాలని, ఏటా వంద రోజులకు కాకుండా 200 రోజులు పని కల్పించి, దినసరి వేతనం రూ.700లు చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో కార్మికుడు అంగవైకల్యం పొందినా, మరణించినా రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు,  పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.