27 August, 2026 | 2:00 PM

చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి

23-06-2026 07:14 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం వెంటనే స్పందించి ఆర్వో ప్లాంట్‌ను అందజేసింది.చంద్‌నగర్ పాఠశాలలో మినరల్ వాటర్ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వార్డ్ సభ్యుడు సయ్యద్ మస్తాన్ గ్రామ సర్పంచ్ సింగం శ్రీహరి, ఉపసర్పంచ్ లంబ రాజు, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సర్పంచ్ సింగం శ్రీహరి పాఠశాలకు ఆర్వో ప్లాంట్‌ను అందజేసి విద్యార్థుల తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ సర్పంచ్ సింగం శ్రీహరి, ఉపసర్పంచ్ లంబ రాజు మరియు పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డ్ సభ్యుడు సయ్యద్ మస్తాన్ మాట్లాడుతూ, చంద్‌నగర్‌లో ఏ సమస్య వచ్చినా గ్రామ పాలకవర్గం వెంటనే స్పందించి పరిష్కరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సర్పంచ్ సింగం శ్రీహరిని శాలువాతో సన్మానించి అభినందించారు.