23 June, 2026 | 8:11 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం

23-06-2026 07:11 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో  2025-26 సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను గ్రామానికి చెందిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సభ్యుడు నన్నూరి ఉపేందర్ రెడ్డి ఒక్కో విద్యార్థికి 2 వేల చొప్పున అందజేసి శాలువాతో సన్మానించి పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. విద్యార్థులు తెలుగు,హింది, ఇంగ్లీషు భాషలలో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటే అన్ని సబ్జెక్ట్స్ లలో పరిపూర్ణత సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  శ్రీనయాచారి, గ్రామ సర్పంచ్ కొన్ రెడ్డి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ బద్దుల లింగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.