06-10-2025 12:15:00 AM
ద్వితీయ సంవత్సరంలో వృత్తిపరమైన కార్యక్రమం
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థు లు వృత్తి విద్యా ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొని వాస్తవ అనుభవాన్ని పొందుతున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి, భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబడింది. సమగ్ర శిక్ష సీనియర్ అధికారి సాంబారి రాజు, వృత్తి విద్యా కోఆర్డినేటర్ బి శాంబశివరావు ములుగు, వరం గల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పాఠ శాలలను సందర్శించారు.
ముఖ్యంగా కేజీబీవీ ములుగు, టీజీఎంఎస్ బండారుపల్లి, టీజీఎంస్ గోవిందరావుపేట, టీజీఎంస్ వెంకటాపూర్, టీజీఎంస్ చిట్యాల్, టీజీఎంస్ ఘన్పూర్, టీజీఎ ంస్ చెన్నెరావుపేట, టీజీఎంస్ గీసుగొండ పాఠశాలలను సందర్శించారు. అలాగే, మరికొన్ని పాఠశాలలలో కూడా ఇంటర్న్షిప్ కార్య క్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఐటీ, బ్యూటీ, వెల్నెస్, వ్యవసాయం, హెల్త్‌కేర్, రిటైల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి విభిన్న వృత్తి కోర్సుల విద్యార్థులు, వృత్తి శిక్షకులు, ఎంప్లాయర్లతో పరస్పరం మట్లాడి ఇంటర్న్షిప్ పురోగతి, విద్యార్థుల భద్రతా చర్యలను సమీక్షించారు.