06-10-2025 10:09:14 AM
కృష్ణారెడ్డిపేటలో గుర్తుతెలియని వ్యక్తుల చర్య
దట్టమైన పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
అమీన్ పూర్ : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్(Ameenpur Municipality) పరిధిలోని కిష్టారెడ్డిపేట స్మశాన వాటిక వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం 4 సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న కిష్టారెడ్డి పేట స్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ డ్రమ్ములను(Chemical drums) తీసుకువచ్చి తగలబెట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో ఒక్కసారిగా కిలో మీటర్ల మేర దట్టమైన పొగ కమ్ముకోవడం, కెమికల్ వాసనతో కూడిన పొగ రావడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పొగ ధూళి, రసాయన వాసనలతో ఉక్కిరిబిక్కిరైనా స్థానిక ప్రజలు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.