06-10-2025 11:26:54 AM
హైదరాబాద్: నకిలీ డాక్టరేట్లు ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఒక మోసగాడి ఆట కట్టించారు పోలీసులు. తాజాగా నకిలీ డాక్టరేట్(Fake Doctorate) ప్రదానం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ పేరుతో నకిలీ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. ఆదివారం నాడు రవీంద్రభారతిలో(Ravindra Bharathi ) సాహిత్యం, కళలు విభాగాల్లో యోహాను ఏడుగురికి నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేశాడు. డబ్బులు వసూలు చేసి నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేసినట్లు గుర్తించారు. నిన్న నిందితుడు యోహానును పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్టరేట్ల ప్రదానంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితుడి యోహాను నుంచి నకిలీ డాక్టరేట్ పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.